రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్
‘బాగున్న సినిమాను ప్రేక్షకులు తప్పకుండా చూస్తారు. దానిని ఎవరూ ఆపలేరు. అది చరిత్ర. ప్రతి ఏడాది సంక్రాంతి సినిమాల విషయంలో నిర్మాతల మధ్య చిన్నపాటి వార్స్ జరుగుతూనే ఉంటాయి. బిజినెస్ ఛాలెంజెస్లో అవన్నీ ఓ భాగం.
‘బాగున్న సినిమాను ప్రేక్షకులు తప్పకుండా చూస్తారు. దానిని ఎవరూ ఆపలేరు. అది చరిత్ర. ప్రతి ఏడాది సంక్రాంతి సినిమాల విషయంలో నిర్మాతల మధ్య చిన్నపాటి వార్స్ జరుగుతూనే ఉంటాయి. బిజినెస్ ఛాలెంజెస్లో అవన్నీ ఓ భాగం. అంతేకానీ ఇక్కడ ఎవరికి ఎవరు శత్రువులు ఉండరు’ అన్నారు అగ్ర నిర్మాత దిల్ రాజు. మహేష్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ‘గుంటూరు కారం’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దిల్‌రాజు మాట్లాడుతూ ‘రాత్రి ఒంటిగంట షోస్‌కు మిశ్రమ స్పందన లభించింది.
వాస్తవాలేమిటో తెలుసుకోవడానికి సుదర్శన్ థియేటర్ వెళ్లి సినిమా చూశాను. తల్లీకొడుకు సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సంక్రాంతి సీజన్లో ఇంటిల్లిపాది చూసే పర్ఫెక్ట్ మూవీ అనిపించింది. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పండగ తర్వాత సినిమా ఎంత వసూళ్లు సాధించిందో తెలుస్తుంది’ అన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ‘మేం ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన లభిస్తున్నది. తొలిరోజు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ లభించాయి. తొలుత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఈవినింగ్ షోస్‌కు అంతా సమసిపోయి పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా చూస్తున్నారు. చక్కటి సెంటిమెంట్, పాటలు, వినోదం అంశాలతో సంక్రాంతి మూవీగా ఆకట్టుకుంటున్నది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

