Pawan Kalyan – OG Movie | హరిహర వీరమల్లు లాంటి డిజాస్టార్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). ఈ సినిమాకు రన్ రాజా రన్, సాహో చిత్రాలతో స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సుజిత్ సైన్ దర్శకత్వం వహిస్తున్నాడు. జపాన్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతుంది. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇప్పటినుంచే ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రయూనిట్. ఇదిలావుంటే.. తాజాగా ఈ మూవీ నుంచి ఒక సాలిడ్ న్యూస్ వైరల్‌గా మారింది. ఈ సినిమా రైట్స్‌కి భారీ డిమాండ్ ఏర్పడగా.. ఓజీ నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారని తెలుస్తుంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ మూవీ డీల్ రూ. 46 కోట్లకు పలికినట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే, నైజాం ఏరియాలో ఇది రికార్డు స్థాయి ధర అని చెప్పవచ్చు. అయితే, ఈ డీల్ గురించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కాగా, ఈ సినిమా థియేట్రికల్ హక్కుల కోసం దిల్ రాజుతో పాటు మరికొందరు నిర్మాతలు కూడా పోటీ పడినట్లు సమాచారం.