Dil Raju | ‘ధీర’ యాక్షన్ మూవీగా మెప్పిస్తుంది: దిల్‌రాజు
లక్ష్ చదలవాడ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ధీర’. తిరుమల తిరుపతి వెంకటేశ్వర పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మించారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 2న విడుదల కానుంది.
Dil Raju | లక్ష్ చదలవాడ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ధీర’. తిరుమల తిరుపతి వెంకటేశ్వర పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మించారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దిల్‌రాజు, గోపీచంద్ మలినేని, త్రినాథరావు నక్కిన ఈ సినిమాకు చెందిన బిగ్ టికెట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ‘శ్రీనివాస్ గారు ఎంతో మంది చిన్న నిర్మాతలకు సాయం చేశారు. ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్‌లోనూ నాకు సహాయం చేశారు. ‘ధీర’ టీజర్ బాగుంది’ అన్నారు.
నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘తండ్రిగా లక్ష్‌ను చూసి గర్విస్తుంటాను. నేను తీసిన ‘రికార్డ్ బ్రేక్’ అనే గ్రాఫిక్స్ సినిమా మార్చిలో రాబోతోంది. సునీల్కుమార్రెడ్డితో హిందీలోనూ ఓ సినిమా చేస్తున్నాను. కేఎన్ నాగేశ్వరరావు ‘నా కనురెప్పవు నువ్వేరా’ కూడా రెడీగా ఉంది. మా ప్రొడక్షన్స్‌లో 16 సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఇండస్ట్రీని ఏకతాటిపైకి తీసుకురావాలన్న ఇరవై ఏళ్ల నా కలను దిల్‌రాజు గారు నెరవేర్చారు’ అన్నారు. హీరో లక్ష్ మాట్లాడుతూ ‘సినిమా కథ గురించి ఇప్పుడేం చెప్పలేం. పక్కనోడిని పట్టించుకోని ఓ వ్యక్తికి ఓ మిషన్ అప్పగిస్తే ఎలా ఉంటుందో ‘ధీర’లో చూడొచ్చు. యాక్షన్ మూవీగా మెప్పిస్తుంది’ అని చెప్పారు. ‘ఇంత పెద్ద బ్యానర్ నుంచి దర్శకుడిగా పరిచయం అవుతాననుకోలేదు. ఒళ్లు దగ్గర పెట్టుకొని ‘ధీర’ కథ రాసుకున్నాను’ అని చిత్ర దర్శకుడు విక్రాంత్ శ్రీనివాస్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

