అగ్ర హీరో షారుఖ్‌ఖాన్‌తో దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ ‘డంకీ’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. తన గత చిత్రాల మాదిరిగానే వినోదం, సామాజిక సందేశం కలబోసిన కథాంశంతో రాజ్‌కుమార్ హిరాణీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారత్ నుంచి అమెరికా, కెనడాకు వెళ్లే అక్రమ వలదారుల నేపథ్య కథ ఇదని సమాచారం. డిసెంబర్ 22న విడుదల కానుంది.
ఈ సినిమా హిందీ డిజిటల్ హక్కులను జియో సినిమా దాదాపు 160కోట్లకు కొనుగోలు చేసిందని తెలిసింది. భారతీయ సినిమా చరిత్రలోనే ఇదొక అరుదైన రికార్డు అని, కేవలం ఒక భాషకు చెందిన డిజిటల్ రైట్స్ ఆ స్థాయిలో అమ్ముడుపోవడం విశేషమని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. షారుఖ్‌ఖాన్-రాజ్‌కుమార్ హిరాణీ కాంబినేషన్ పట్ల గ్లోబల్ ఆడియెన్స్ సైతం ఆసక్తిని ప్రదర్శిస్తున్నారని, దాంతో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ జరగబోతుందని అంచనా వేస్తున్నారు. షారుఖ్‌ఖాన్ స్వీయ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది.