Shah Rukh Khan-Amir Khan | బాలీవుడ్లో ‘ఖాన్ త్రయం’లోని షారుక్, అమీర్ మధ్య పోటీ గురించి గానీ ఈ ఇద్దరికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి గానీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పన్లేదు. సుమారుగా గడిచిన మూడు దశాబ్దాలుగా బాలీవుడ్‌ను ఏలుతున్న ఈ ఇద్దరు హీరోల మధ్య సఖ్యత ఉన్నా అభిమానులు మధ్య వైరం మాత్రం కొనసాగుతూనే ఉంది. ‘మా హీరో గొప్ప అంటే మా హీరో’ అంటూ ఇప్పటికీ ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ ఇద్దరి అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ సంగతి అటుంచితే.. షారుక్, అమీర్ పూర్వీకులు రాజకీయ ప్రత్యర్థులన్న విషయం చాలామందికి తెలియదు. షారుక్ తండ్రి, అమీర్ ఖాన్ ముత్తాత 1957 లోక్‌సభ ఎన్నికలలో ముఖాముఖి తలపడ్డారట.
షారుక్ ఖాన్ తండ్రి మీర్ తాజ్ మహ్మద్ ఖాన్, అమీర్ ఖాన్ ముత్తాత మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాజకీయ ప్రత్యర్థులుగా పోటీ చేశారు. 1957 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ ఇద్దరూ గుర్గావ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. ఆజాద్ కాంగ్రెస్ నుంచి పోటీచేయగా తాజ్ మహ్మద్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు. భారతీయ జనసంఘ్ నుంచి మూల్ చంద్ పోటీపడ్డారు. అయితే ఈ ఎన్నికలలో షారుక్ తండ్రి దారుణ పరాభవం పాలయ్యాడు. గతంలో కాంగ్రెస్ వాదిగా ఉన్నప్పటికీ ఆయన ఎన్నికలకు ముందు ఆ పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. ఆ ఎన్నికలలో మౌలానాకు 1,91,221 ఓట్లు రాగా మూల్‌చంద్‌కు 95,553 ఓట్లు వచ్చాయి.
Shah Rukh Khan’s father contested Lok Sabha Elections in 1957 from Gurgaon against Abul Kalam Azad the great grand uncle of Aaamir Khan https://t.co/R7Jn5lruGn
— Prithvi (@Prithvi10_) September 2, 2024
Its so unknown fact that I had to google it and verify in 3-4 places to belief 😲
— samar (@yoursamar) September 2, 2024
‘ఎక్స్’లో Pop Base అనే యూజర్.. ‘మీకు తెలిసిన సెలబ్రిటీ ఫ్యాక్ట్ గురించి చెప్పండి’ అని అడుగగా Prithvi Babu అనే మరో యూజర్ ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. అతడు ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఈ పోస్ట్ నెట్టింట అటు షారుక్, అమీర్‌తో పాటు బాలీవుడ్ అభిమానులను ఆకర్షించింది. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ ‘ఇదిగనక ఇప్పుడు జరిగుంటే ఫ్యాన్ వార్ మరింత క్రేజీగా ఉండేది’ అని కామెంట్ చేశాడు.
Imagine if it happened today the fan wars would be crazy .
— dr.soaib (@shoeab24) September 2, 2024