‘జవాన్’ చిత్రం ద్వారా అగ్ర కథానాయిక నయనతార బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకురానుంది. హిందీ చిత్రసీమలో తన తొలి సినిమా విడుదలకు ముందే నయనతార ఉత్తరాది ప్రేక్షకుల అభిమానం సంపాదించుకుంది. అయితే ఈ సినిమాలో తొలుత కథానాయికగా సమంతను ఎంపిక చేశారట. 2019లో ఈ సినిమా కోసం ఆమెను సంప్రదించగా అప్పటి కమిట్మెంట్స్ కారణంగా తిరస్కరించిందట. ఒకవేళ సమంత ఈ సినిమా ఒప్పుకొని ఉంటే బాలీవుడ్లో మంచి బ్రేక్ దొరికేదని ఆమె అభిమానులు అనుకుంటున్నారు. అట్లీ దర్శకత్వం వహించిన ‘మెర్సెల్’ ‘తేరి’ చిత్రాల్లో సమంత హీరోయిన్గా నటించింది. ఈ అనుబంధం కారణంగానే దర్శకుడు అట్లీ సమంతను సంప్రదించారని అంటున్నారు. సమంత నటించిన ‘ఖుషి’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.