Hansika Motwani | త్వరగా పెరిగేందుకు ఆ ఇంజక్షన్స్ తీసుకున్న హన్సిక..? స్పందించిన నటి
త్వరగా పెరిగేందుకు (grow faster) ఇంజక్షన్స్ (hormonal injections) తీసుకుంది అంటూ వచ్చిన రూమర్స్‌పై నటి హన్సిక (Hansika Motwani) స్పందించింది. ‘లవ్ షాదీ డ్రామా’ (Love Shaadi Drama)రెండో ఎపిసోడ్లో ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.
Hansika Motwani | చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి, పదహారేళ్ళకే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.. దక్షిణాదిన అగ్ర కథానాయికగా వెలుగొందింది హన్సిక మోత్వానీ(Hansika Motwani ). ‘దేశముదురు’, ‘మస్కా’, ‘బిల్లా’, ‘కందిరీగ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.
అయితే హీరోయిన్ శరీరంలో కొద్దిగా మార్పులు కనిపించినా దానిపై విపరీతమైన పుకార్లు వస్తుంటాయి. అందం పెంచుకునేందుకు సర్జరీలు, ఇంజక్షన్స్ తీసుకున్నారంటూ ట్రోల్స్ చేస్తుంటారు. సమంత, శ్రుతిహాసన్ తదితర స్టార్ నాయికలు విదేశాల్లో సర్జరీలు చేయించుకున్నారంటూ గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. హన్సికపై కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. ఈ రూమర్స్‌పై నటి తాజాగా స్పందించింది. ‘లవ్ షాదీ డ్రామా’ (Love Shaadi Drama)రెండో ఎపిసోడ్లో ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.
‘సెలబ్రిటీగా ఉండటమంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. నాకు 21 ఏండ్ల వయసు ఉన్నప్పుడు చాలా మంది నా గురించి చెత్తవాగుడు వాగారు. నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతోందనుకుంటా. చాలా మంది నేను త్వరగా పెరిగేందు (grow faster)కు హార్మోనల్ ఇంజక్షన్స్ ( hormonal injections) తీసుకున్నా అంటూ రాసుకొచ్చారు. ఎనిమిదేళ్ల వయసులోనే నేను నటిని అయ్యాను. అందుకని మా అమ్మ నాకు హార్మోనల్ ( hormonal injections) ఇంజక్షన్స్ ఇచ్చి నన్ను త్వరగా పెద్దదాన్ని చేసిందని మాట్లాడుకున్నారు. అది నిజమని ఎలా అనుకుంటున్నారు..?’ అంటూ హన్సిక ఆగ్రహం వ్యక్తం చేసింది.
అనంతరం హన్సిక తల్లి మోనా మాట్లాడుతూ.. ‘నేను నిజంగా హన్సికకి ఇంజక్షన్స్ ఇచ్చి పెంచి ఉంటే టాటా, బిర్లా (Tata, Birla) కంటే ధనవంతురాలిని అయ్యే దానిని. ప్రతి ఒక్కరు త్వరగా పెరిగేందుకు నా దగ్గరికే వచ్చేవారు కదా.. ఇలా అసత్యమైన ప్రచారాలు చేసేందుకు కనీసం కామన్ సెన్స్ ఉండాలి’ అంటూ హన్సిక తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
హన్సిక మోత్వానీ వివాహం వ్యాపారవేత్త సొహైల్ కతూరియా (Sohael Khaturiya)తో గతేడాది డిసెంబర్ 4న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ జైపూర్‌లోని ఓ కోటలో సింధీ సంప్రదాయం ప్రకారం వీరు వివాహం చేసుకున్నారు. పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

