Dhurandhar Box Office | బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన ‘ధూరందర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 05 న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. తొలి రోజే రూ. 28.60 కోట్ల వసూళ్లును సాధించిన ఈ చిత్రం శనివారం రోజున రూ.33 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమాలో రణ్వీర్ గుడఛారి పాత్రలో కనిపించాడు. సారా అర్జున్ కథానాయికగా నటించగా.. అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, మాధవన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.