Dhurandhar 2 | బాలీవుడ్లో తెరకెక్కిన భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ ధురంధర్ 2 ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సీక్వెల్ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ రికార్డుల వేటలో దూసుకుపోతోంది. మొదటి భాగానికి కొనసాగింపుగా వచ్చిన ఈ మూవీ, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, గ్రిప్పింగ్ స్పై ఎలిమెంట్స్, అద్భుతమైన ట్విస్ట్‌లతో ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తోంది. విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ ఈ సినిమాకు హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తుండటం దీని సక్సెస్‌ను స్పష్టం చేస్తోంది.ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది.
అంతేకాకుండా, నాలుగు రోజుల్లోనే ఈ మూవీ రూ.750 కోట్ల మార్క్‌ను టచ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో తొలి వీకెండ్‌కే పలు రికార్డులను ఈ సినిమా బద్దలు కొట్టింది. ఇప్పటివరకు ఉన్న భారీ రికార్డులను కూడా ‘ధురంధర్ 2’ అధిగమించింది. ముఖ్యంగా బాహుబలి 2 (రూ.591 కోట్లు), ఆర్ఆర్ఆర్ (రూ.470 కోట్లు) సాధించిన ఓపెనింగ్ వీకెండ్ వసూళ్లను ఈ చిత్రం దాటేసింది. అయితే హయ్యెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ రికార్డ్ విషయంలో మాత్రం పుష్ప 2 (రూ.762 కోట్లు) తర్వాత రెండో స్థానంలో నిలిచింది.
ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ తన పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్తో మరోసారి ప్రేక్షకులను అలరించగా, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సారా అర్జున్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. యాక్షన్, ఎమోషన్, దేశభక్తి మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, 2026లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే వేగంతో వసూళ్లు కొనసాగితే, త్వరలోనే ఈ సినిమా రూ.1000 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.