చేతన్‌కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ధూం ధాం’. సాయికుమార్, వెన్నెలకిశోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇందులో కీలక పాత్రధారులు. సాయికిశోర్ మచ్చా దర్శకుడు. ఎం.ఎస్.రామ్‌కుమార్ నిర్మాత. షూటింగ్ పూర్త్తిచేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన రెండవ పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘మాయాసుందరి.. హే మాయాసుందరి.. నా మాయాసుందరి.. ఎక్కడున్నావో మరీ..’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా, గోపీసుందర్ స్వరపరిచారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. హీరో పాడుకునే ఈ ప్రేమగీతాన్ని దర్శకుడు సాయికిశోర్ మచ్చా ైస్టెలిష్‌గా రూపొందించారని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: ప్రవీణ్‌వర్మ, కెమెరా: సిద్ధార్థ్ రామస్వామి.