Dhimahi Movie | 7:11PM చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ కుర్ర హీరో సాహస్ పగడాల (Sahas Pagadala). ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్తో తన తదుపరి ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ధీమహి'(Dhimahi). జయ జయ హే మహిషసుర మర్ధిని అనేది ఉపశీర్షిక. కెప్టెన్ కుక్ ఫిలిమ్స్ పతాకంపై ఈ సినిమాను విరాట్ కపూర్, సాహస్ పగడాల సంయుక్తంగా నిర్మిస్తుండగా.. నవీన్ కంటె, సాహస్ పగడాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి మేకర్స్ ఒక అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీని అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. థ్రిల్లర్ జానర్లో వస్తున్న ఈ సినిమాలో నిఖిత చోప్రా హీరోయిన్గా నటిస్తుంది. షారోన్ రవి సంగీతం అందించాడు.
#Dhimahi Grand Release In Theatres Worldwide on 27th october 2023🔥#DhimahiOnOct27th@saahaspagadala @MDeepak0808 @ChayPadigala @CineDigital_ @zeemusicsouth pic.twitter.com/K8ntHm1nZP
— Vamsi Kaka (@vamsikaka) October 15, 2023