దీక్షిత్‌శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చి త్రం ‘కింగ్-జాకీ-క్వీన్’. దివంగత దర్శకుడు కేకే తెరకెక్కించారు. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సోమవారం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. 1990ల నేపథ్యంలో ఈ కథ సాగింది.
పరిస్థితులు ఒక మనిషిని ఏ విధంగా ప్రభావితం చేస్తాయనే ఫిలాసఫీతో అధికారం, అహంకా రం, ప్రతీకారం ప్రధానాంశాలుగా ఇద్దరు స్నేహితుల మధ్య సంఘర్షణ నేపథ్యంలో ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠను పంచింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 7న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: నాగేశ్ బనెల్, సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి, నిర్మాత: సుధాకర్ చెరుకూరి, దర్శకత్వం: కేకే.