సీనియర్ కథానాయిక అమలాపాల్ ‘ఖైదీ’ హిందీ రీమేక్‌లో అజయ్‌దేవ్‌గణ్ సరసన ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ‘భోలా’ పేరుతో హిందీలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ధర్మేంద్రశర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్‌దేవ్‌గణ్, టబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని హిందీ నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేశారు. దర్శకుడు ఏ.ఎల్.విజయ్‌తో విడాకుల అనంతరం కెరీర్‌పై దృష్టిపెట్టిన అమలాపాల్ ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది.