Kara Pre Release Event | ‘కర’ మూవీని తెలుగు ప్రేక్షకులందరూ పెద్ద హిట్ చేయాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్
KaraPreReleaseEvent | తమిళ స్టార్ హీరో ధనుష్, మలయాళ సెన్సేషన్ మమితా బైజు జంటగా నటించిన క్రేజీ ప్రాజెక్ట్ ‘కర’. ‘పోరు తొళిల్’ వంటి వైవిధ్యమైన చిత్రంతో మెప్పించిన విఘ్నేశ్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, డా. ఐషరి కె. గణేష్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
KaraPreReleaseEvent | తమిళ స్టార్ హీరో ధనుష్, మలయాళ సెన్సేషన్ మమితా బైజు జంటగా నటించిన క్రేజీ ప్రాజెక్ట్ ‘కర’. ‘పోరు తొళిల్’ వంటి వైవిధ్యమైన చిత్రంతో మెప్పించిన విఘ్నేశ్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, డా. ఐషరి కె. గణేష్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ మరియు ఆర్ స్టార్ లాజిస్టిక్స్ సంస్థలు ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆదివారం నాడు హైదరాబాద్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, ప్రముఖ దర్శకులు బుచ్చిబాబు సానా, వెంకీ అట్లూరి హాజరై చిత్ర యూనిట్‌కు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ వేడుకలో హీరో ధనుష్ మాట్లాడుతూ, ‘కర’ ఒక సాధారణ యువకుడి జీవితం చుట్టూ తిరిగే అసాధారణ కథ అని, దర్శకుడు విఘ్నేశ్ రాజా తన మేకింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘పోరు తొళిల్’ చూసిన తర్వాత ఆయనలోని ప్రతిభ నచ్చి ఈ సినిమా చేశానని, ఇది తప్పకుండా అద్భుతాలు సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తన స్నేహితుడు జీవీ ప్రకాష్ అందించిన సంగీతం, మమితా బైజు నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెబుతూ, ‘కుబేర’, ‘ఇడ్లీ కడై’ చిత్రాల కంటే ముందే ‘కర’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. వేదికపైకి వచ్చిన సాయి దుర్గ తేజ్, వెంకీ అట్లూరి, బుచ్చిబాబులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఏప్రిల్ 30న థియేటర్లలో సినిమాను చూసి ఆశీర్వదించాలని కోరారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ, ధనుష్ సినిమాలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన నిజజీవితంలోని ప్రేమకథలకు ధనుష్ పాటలకు విడదీయలేని సంబంధం ఉందని, ‘రఘువరన్ బీటెక్’లో ఆయన పండించిన ఎమోషన్స్ తనపై ఎంతో ప్రభావం చూపాయని కొనియాడారు. అలాగే దర్శకుడు విఘ్నేశ్ రాజా గత చిత్రం తనకు చాలా ఇష్టమని, ఈ సినిమా కూడా అదే స్థాయిలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. మరో అతిథి బుచ్చిబాబు సానా మాట్లాడుతూ, ధనుష్‌పై ఉన్న అభిమానంతోనే తాను ఇక్కడికి వచ్చానని, కాళీపట్నంలోని ‘కర మాస్టర్’ పేరును ఈ సినిమాకు పెట్టడం విశేషమని పేర్కొన్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ, ధనుష్‌తో తాను చేసిన ‘సార్’ చిత్రం కంటే ఈ సినిమా పెద్ద హిట్ కావాలని, మమితా బైజు తన సహజసిద్ధమైన నటనతో తెలుగువారిని అలరిస్తుందని జోస్యం చెప్పారు.
హీరోయిన్ మమితా బైజు తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ సినిమా తన కెరీర్లో ఒక మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని పేర్కొన్నారు. సీనియర్ దర్శకుడు, నటుడు కేఎస్ రవి కుమార్ మాట్లాడుతూ ఈ చిత్రానికి తానే స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పానని, తెలుగు ఆడియెన్స్ తనపై చూపే ప్రేమ మరువలేనిదని భావోద్వేగానికి లోనయ్యారు. నిర్మాత డా. ఐషరి కె. గణేష్ తనకున్న తెలుగు రాష్ట్రాల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, సాయి తేజ్ తమ విద్యా సంస్థల్లోనే చదివారని, ఆయన రావడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు విఘ్నేశ్ రాజా మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకులు ఇచ్చే గౌరవానికి తగ్గట్టుగానే ‘కర’ మూవీ ఉంటుందని, ప్రేక్షకుల సమయం మరియు డబ్బు వృధా కాకుండా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దానని స్పష్టం చేశారు. చిత్ర నిర్మాతలు మరియు పంపిణీదారులు ఏప్రిల్ 30న విడుదల కానున్న ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

