IdliKadai OTT తమిళ సూపర్‌స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఇడ్లీ కడాయ్’ (తెలుగులో ఇడ్లీకోట్టు). దసరా కానుకగా అక్టోబర్ 01న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిశ్రమ స్పందనలు అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 29 నుంచి ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ధనుష్ సొంత ప్రొడక్షన్ హౌస్ వండర్‌బార్ ఫిల్మ్స్‌తో పాటు డాన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నిత్యా మేనన్ హీరోయిన్గా నటించగా, అరుణ్ విజయ్, శాలినీ పాండే, సత్యరాజ్, పర్థిబాన్, సముద్రకాని, రాజ్కిరణ్లు ముఖ్య పాత్రల్లో కనిపించారు. GV ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చగా, కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Oru chinna idli kadai, oraayiram memories ♨️🥰 pic.twitter.com/Otdh7ydb3d
— Netflix India South (@Netflix_INSouth) October 24, 2025