Lord Venkateswara | తమిళ స్టార్ హీరో ధనుష్ బుధవారం తెల్లవారుజామున కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు తన ఇద్దరు కుమారులు యాత్ర, లింగా కూడా ఉండటం విశేషం. ధనుష్ తన పిల్లలతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోగా, దర్శనం అనంతరం ఆలయ పండితులు వారికి తీర్థప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఎప్పటిలాగే తన సింప్లిసిటీని చాటుకున్న ధనుష్, పంచె కట్టుకుని సాంప్రదాయ దుస్తుల్లో తన కుమారులతో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా తీసిన వీడియోలు మరియు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Dhanush Tirupati Visit | ’’கோவிந்தா கோவிந்தா’’மகன்களுடன் வந்த தனுஷ் திருப்பதியில் சாமி தரிசனம் | Yathra | Lingahttps://t.co/wupaoCzH82 | #dhanush #tirupati #yathra #linga #viralvideo #ABPnadu pic.twitter.com/dpfeDShm12
— ABP Nadu (@abpnadu) January 28, 2026