Vetrimaran Next Movie | ఇండస్ట్రీలో కొన్ని కాంబోలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆ కాంబోలో సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు.. సినీ సెలబ్రెటీలు సైతం ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోలలో ఒకటి ధనుష్-వెట్రిమారన్. ఇప్పటివరకు వీళ్ల కాంబోలో నాలుగు సినిమాలోచ్చాయి. నాలుగు ఒక దానికి మించి మరొకటి విజయాలు సాధించాయి. అంతేకాదు ధనుష్‌కు మాస్ ఆడియెన్స్‌లో తిరుగులేని పాపులారిటీ తెచ్చిపెట్టింది కూడా ఈ సినిమాలే. దాంతో మళ్లీ వీళ్ల కాంబోలో ఐదో సినిమా ఎప్పుడెప్పుడు తెరకెక్కుతుందా అని ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
కాగా కొన్ని నెలల ముందు ఈ కాంబోలో సినిమా వస్తున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఇక ఇటీవలే విడుతలై మూవీ ప్రమోషన్లలో ధనుష్‌తో నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్లు వెట్రీ క్లారిటీ ఇచ్చేశాడు. దాంతో ఈ సారి వీళ్లు ఎలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నారో అని అప్పటి నుంచి చర్చలు మొదలయ్యాయి. కాగా తాజాగా వీళ్ల కాంబోకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కేజీఎఫ్ బ్యాక్‌డ్రాప్‌లో వీళ్ల కలయికలో సినిమా రూపొందుతున్నట్లు తమిళ వర్గాల నుంచి సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక ధనుష్‌తో పాటు ఈ సినిమాలో తారక్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తునే ఉన్నాయి. దీనిపై ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు.
ప్రస్తుతం వెట్రిమారన్ విడుదల పార్ట్-2తో పాటు సూర్యతో వాడివాసల్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. సీఎస్ చెల్లప్ప తమిళ పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా బుల్ ఫైట్ నేపథ్యంలో ఉండనుంది. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ పోస్టర్లకు విశేష స్పందన వచ్చింది.