Dhanush | కోలీవుడ్‌లో ఒకప్పుడు సాంకేతిక పరిజ్ఞానం, ప్రతిభ, కథలు అన్నీ ఒకే సినిమా చుట్టూ తిరిగేవి. కానీ 2011లో వచ్చిన ఒక చిన్న పాట తమిళ సినిమా ఇండస్ట్రీనే కాదు, భారతీయ మ్యూజిక్ కల్చర్‌ను కూడా మార్చేసింది. యూట్యూబ్ ఇంకా ఎదుగుతున్న దశలో ఉండగా, ఒక సరదా ట్యూన్ ప్రపంచం అంతా విస్తరించింది. అది ‘వై దిస్ కొలవెరి డీ’ . ఈ పాట పేరు చెబితే ఒక్కసారిగా ఆ టైమ్‌కి వెళ్లిన ఫీల్ వస్తుంది. ఇప్పుడు ఈ పాట వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను, అది తన కెరీర్‌కు ఆశీర్వాదమా శాపమా అనే విషయాన్ని స్వయంగా వెల్లడించారు కోలీవుడ్ స్టార్ ధనుష్ .
అప్పట్లో ఈ పాట చేసిన హంగామా చెప్పక్కర్లేదు. ఇండియా నుంచే కాదు, ప్రపంచమంతా దుమ్ము లేపిన ఈ పాట యూట్యూబ్‌లో ప్రస్తుతం 560 మిలియన్ వ్యూస్ దాటింది. ఈ పాట కామెడీగా రూపొందించబడింది. ‘త్రీ’ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ తో కలిసి సరదాగా రికార్డ్ చేసిన ట్రాక్ ఇది. “ఫన్ కోసం చేశాం. పూర్తిగా మర్చిపోయాం కూడా” అని గుర్తుచేసుకున్నారు ధనుష్. ఇది సీరియస్ ట్రాక్ కాదు, కేవలం సరదా కోసం చేసిందే. అప్లోడ్ చేసిన కొద్దిసేపటికే వ్యూస్ ఆకాశాన్నంటాయి. కాలేజీలు, ఆఫీసులు, వివాహాలు ఎక్కడ చూసినా ‘కొలవెరి’ ఫీవర్ పరుగులు తీసింది
ప్రపంచవ్యాప్తంగా ఫేమ్ అందించిన ఈ పాట “నన్ను వెంటాడే ఒక నీడలాంటిది” అని ధనుష్ చెప్పుకొచ్చాడు . ఇంటర్వ్యూలో, ప్రమోషన్లలో ఎక్కడికి వెళ్లినా ఈ పాట గురించి అడుగుతూనే ఉంటారని చెప్పారు. ఒక దశలో ఇది తన ఇతర టాలెంట్ కూడా మర్చిపోయేలా చేస్తోందని ఫీల్ అయ్యారట. “గర్వంగానే ఉండేది… కానీ దీని నుంచి దూరంగా వెళ్లాలని కూడా అనిపించేది. ఇది నాకు ఆశీర్వాదమా, శాపమా తెలియదు అని ఆయన స్పష్టం చేశారు. వైరల్ వేవ్‌లను రైడ్ చేస్తూ, వాటినీ దాటుకుని ముందుకు వెళ్లడం ప్రతిభావంతుల చేతిలో మాత్రమే సాధ్యం. ధనుష్ కూడా అదే చేశారు. ‘కొలవెరి’ ఆయన గ్లోబల్ రికగ్నిషన్‌కు స్టార్టింగ్ పాయింట్. ‘కొలవెరి’ ధనుష్‌కి శాపం కాదు..ఒక మెమరీ, ఒక లెసన్, ఒక గొప్ప ఆరంభం!