Dhanush | తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మల్టీ టాలెంటెడ్ యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు ధనుష్. యాక్టర్‌గా, దర్శకుడిగా,నిర్మాతగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంటూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. ఇటీవలే ధనుష్ నటించిన కుబేర తెలుగులో సూపర్ హిట్టవగా.. తమిళంలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కాగా ధనుష్ దర్శకత్వం వహించిన మూడో సినిమా నీక్ (NEEK).
తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా టైటిల్‌తో విడుదలైంది. కాగా ఈ మూవీ 6 నెలల థ్రియాట్రికల్ రిలీజ్ తర్వాత ఇక టీవీలో విడుదలయ్యేందుకు రెడీ అయింది. జీ తెలుగులో ఆగస్టు 6న సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్ కానుంది. మరి తెలుగు ప్రేక్షకులను టీవీలో ఎలా ఇంప్రెస్ చేస్తుందో చూడాలి.
పవీశ్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, రమ్య రంగనాథన్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రం యూత్‌ఫుల్ ఎమోషన్స్, మోడ్రన్ రిలేషన్స్ చుట్టూ తిరిగే కథాంశంతో సాగుతుంది. వండర్ బార్ ఫిలిమ్స్, ఆర్కే ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.
They call him OG | ఓజీ ఫీవర్.. మహేశ్ బాబు రికార్డ్ బీట్ చేసిన పవన్ కల్యాణ్.. !