Captain Miller | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) టైటిల్ రోల్ పోషిస్తున్న ప్రాజెక్ట్ కెప్టెన్ మిల్లర్ (Captain Miller). అరుణ్ మథేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతి/పొంగళ్ కానుకగా విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ నయా లుక్ విడుదల చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Mohan) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే విడుదలైన ధనుష్, ప్రియాంకా మోహన్ ఫస్ట్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా కెప్టెన్ మిల్లర్ వర్కింగ్ స్టిల్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. సెట్స్‌లో సందీప్ కిషన్, ధనుష్, ప్రియాంకా అరుళ్ మోహన్‌కు సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కెప్టెన్ మిల్లర్‌లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shivarajkumar), టాలీవుడ్ యాక్టర్ సందీప్ కిషన్, నివేదితా సతీశ్, అమెరికన్ యాక్టర్, ఆర్ఆర్ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
కెప్టెన్ మిల్లర్ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్ స్పూర్తితో సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్లో వస్తోంది. కెప్టెన్ మిల్లర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. కెప్టెన్ మిల్లర్ ఆడియో రైట్స్‌ను పాపులర్ మ్యూజిక్ లేబుల్ సరిగమ దక్కించుకున్నట్టు ఇప్పటికే అప్డేట్ వచ్చిందని తెలిసిందే.
కెప్టెన్ మిల్లర్ వర్కింగ్ స్టిల్స్..
From The Sets of #CaptainMiller 😎
.@dhanushkraja @ArunMatheswaran @NimmaShivanna @sundeepkishan @gvprakash @priyankaamohan @SathyaJyothi
.#CaptainMillerFromPongal #Dhanush #PriyankaMohan #sundeepkishan#CaptainMillerFromSankranti pic.twitter.com/GGeRoYIlwo— SS Music (@SSMusicTweet) November 8, 2023
From The Sets of #CaptainMiller 😎
.@dhanushkraja @ArunMatheswaran @NimmaShivanna @sundeepkishan @gvprakash @priyankaamohan @SathyaJyothi
.#CaptainMillerFromPongal #Dhanush #PriyankaMohan #sundeepkishan#CaptainMillerFromSankranti pic.twitter.com/LkTNQpWolo— SS Music (@SSMusicTweet) November 8, 2023
From The Sets of #CaptainMiller 😎
.@dhanushkraja @ArunMatheswaran @NimmaShivanna @sundeepkishan @gvprakash @priyankaamohan @SathyaJyothi
.#CaptainMillerFromPongal #Dhanush #PriyankaMohan #sundeepkishan #CaptainMillerFromSankranti pic.twitter.com/2et35nGSJg— SS Music (@SSMusicTweet) November 8, 2023
విడుదలపై సస్పెన్స్‌కు తెర..
The much awaited #CAPTAINMILLER is all set for a grand Release this PONGAL / SANKRANTI 2024 #CaptainMillerFromPongal#CaptainMillerFromSankranti @dhanushkraja @ArunMatheswaran @NimmaShivanna @sundeepkishan @gvprakash @priyankaamohan @SathyaJyothi pic.twitter.com/mO8aabkVaE
— Ramesh Bala (@rameshlaus) November 8, 2023
కెప్టెన్ మిల్లర్ టీజర్..