న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లో క్రికెట్ మరోమారు వివాదాల్లోకి ఎక్కింది. జమ్మూకశ్మీర్ చాంపియన్స్ లీగ్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో స్థానిక ప్లేయర్ పాలస్తీనా జెండా ఉన్న హెల్మెట్ ధరించాడు. జమ్మూ ట్రయల్‌బ్లేజర్స్ జట్టుతో జరిగిన పోరులో జేకే 11 టీమ్ తరఫున బరిలోకి దిగిన ఫర్కాన్ భట్ పాలస్తీనా జాతీయ జెండాతో బరిలోకి దిగాడు.
నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ ఫర్కాన్ భట్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హెల్మెట్‌పై పాలస్తీనా జెండా స్పష్టంగా వీడియోలో కనిపించింది. ఇది ఒక్కసారిగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. క్రికెటర్ ఫర్కాన్తో పాటు టోర్నీ నిర్వాహకుడు జాహిద్ భట్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ విషయమై జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేసన్‌ను సంప్రదించగా, ఈ టోర్నీ తమ అనుమతి లేకుండా జరిగిందని వారు పేర్కొన్నారు.