Dhanush | వంద కోట్ల బడ్జెట్‌తో ధనుష్ కొత్త చిత్రం
Dhanush Captain Miller Budget | తమిళ హీరో ధనుష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈయన నటించిన సినిమాలు తెలుగు డబ్బింగ్లో అడపా దడపాగా విడుదలవుతూ ఉండేవి. అయితే ‘రఘువరన్ B-Tech’ ధనుష్‌కు తెలుగులో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ చిత్రం తర్వాత ఈయన నటించిన సినిమాలన్ని తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతున్నాయి. ప్రస్తుతం ధనుష్ ఐదు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో అరుణ్ మతేశ్వరణ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘కెప్టెన్ మిల్లర్’ ఒకటి. ఇటీవలే విడుదలైన టైటిల్ మోషన్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మేకర్స్ దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారట. ఇదే నిజమైతే ధనుష్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. 1930-40 టైం పీరియడ్‌లో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. జీ. వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సత్య జోతి బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, ఆర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ధనుష్ నటించిన హాలీవుడ్ మూవీ ‘ది గ్రే మ్యాన్’ జూలై 15న విడుదల కానుంది. దీనితో పాటుగా తమిళంలో ‘తిరుచిత్రంబలం’ ఆగస్టు 22న విడుదల కానుంది. తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సర్’ సినిమాను చేస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

