Dhanush | గత ఏడాది చెన్నైలోని పోయస్ గార్డెన్ ప్రాంతంలో 150 కోట్లతో విలాసవంతమైన గృహాన్ని నిర్మించుకున్నారు అగ్ర హీరో ధనుష్. ఆ ఏరియాలో ఇల్లు కట్టుకోవాలన్నది తన చిన్ననాటి కల అని అనేక సందర్భాల్లో చెప్పారాయన. అయితే కష్టార్జితంతో ఇల్లు నిర్మించుకోవడాన్ని కూడా వివాదంగా మార్చుతున్నారని ధనుష్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన తాజా చిత్రం ‘రాయన్’ ప్రెస్మీట్లో ఇంటి విషయంపై స్పందించారు.
‘పోయస్గార్డెన్లో ఇల్లు కట్టుకోవడం ఇంత హాట్‌టాపిక్‌గా మారుతుందని అనుకోలేదు. ముందే తెలుసుకొని ఉంటే ఎక్కడో చిన్న అపార్ట్మెంట్ తీసుకునేవాడిని. నేను ఇల్లు కొనుక్కోకూడదా? ఒకేచోట ఎప్పుడూ ఉండిపోవాలా? అని ధనుష్ ప్రశ్నించారు. తాను రజనీకాంత్‌కు వీరాభిమానినని, చిన్నతనంలో పోయస్గార్డెన్లో ఆయన ఇల్లు చూసి ఎప్పటికైనా అలాంటి ఇల్లు కట్టుకోవాలని కలలు కన్నానని, హీరో అయ్యాక ఆ కల నేరవేరిందని ధనుష్ చెప్పారు. ధనుష్ 50వ చిత్రం ‘రాయన్’ ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది.