Kubera | ‘లవ్‌స్టోరీ’ తర్వాత శేఖర్ కమ్ముల ప్రకటించిన సినిమా ‘కుబేర’. ‘ధనుష్ హీరోగా, అక్కినేని నాగార్జున కీలక పాత్రలో ఈ సినిమా రూపొందుతున్నది’ అనే ప్రకటన వెలువడిన మరుక్షణమే సినిమాపై బజ్ ఓ స్థాయిలో క్రియేటయ్యింది. ఈ సినిమా మొదలై దాదాపు రెండేళ్లు కావొస్తున్నది. షూటింగ్ కూడా నిదానంగా సాగుతున్నది.
ఈ సినిమా ప్రకటించిన తర్వాత ధనుష్ నుంచి ‘సార్’ , ‘రాయన్’ సినిమాలు విడుదలయ్యాయి. ‘ఇడ్లీ కడై’ కూడా ఏప్రిల్ 10న విడుదల కానున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దాంతో ‘కుబేర’ రిలీజ్ ఎప్పుడవుతుంది? అనేది ప్రేక్షకులకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే.. లేటెస్ట్ బజ్ ప్రకారం ‘కుబేర’ రిలీజ్ డేట్ లాక్ అయినట్టు తెలుస్తున్నది.
ఈ ఏడాది జూన్ 20న ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. సునీల్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్‌లతో కలిసి శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.