ధనుష్ కథానాయకుడిగా, నాగార్జున ప్రత్యేక పాత్రలో రూపొందుతోన్న మోస్ట్ వెయిటెడ్ పాన్ఇండియా మూవీ ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణంలో ఉంది. వినాయకచవితి పర్వదినం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
ధనుష్, నాగార్జున పోషించిన పాత్రల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ పోస్టర్ ఆవిష్కరించింది. ధనుష్ మ్యాసీ హెయిర్‌తో, గుబురు గడ్డంతో కనిపించగా, నాగార్జున మోడ్రెన్ లుక్‌లో ైస్టెలిష్‌గా దర్శ నమిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జిమ్ సర్భ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీవేంకటేశ్వర సినిమా స్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రై.లిమిటెడ్ పతాకాలపై ఈ చిత్రం రూపొందుతున్నది.