తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో ధనుష్ ఒకరు. ఇటీవలే ఆయన ‘కుబేర’ చిత్రంతో భారీ హిట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన వరుసగా సినిమాల్ని అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ధనుష్ 54వ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. డీ54 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి విఘ్నేష్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇషారి కె గణేష్ నిర్మాత.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను కూడా మొదలుపెడుతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్లో ధనుష్ పవర్ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. హై ఇంటెన్సిటీ యాక్షన్ చిత్రమిదని, ధనుష్ పాత్ర కొత్త పంథాలో ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. మమితబైజు, కె.ఎస్.రవికుమార్, జయరామ్, కరుణాస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: తేని ఈశ్వర్, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, దర్శకత్వం: విఘ్నేష్ రాజా.