Dhamaka Movie | ‘క్రాక్’ వంటి భారీ విజయం తర్వాత ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో రవితేజ తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం ఈయన ఒక మంచి హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘ధమాకా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ ‘డు డు’ అంటూ సాగే మాస్ బీట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
లేటెస్ట్గా రిలీజైన ఈ పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. పృథ్వీచంద్ర ఆలపించిన ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించాడు. భీమ్స్ సిసిరోలియో ట్యూన్ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే చిత్రబృందం రిలీజ్ చేసిన ‘జింతాక్’, ‘వాట్స్ హప్పెనింగ్’ పాటలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవితేజకు జోడీగా పెళ్ళి సందడి ఫేం శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ-స్క్రీన్‌ప్లే-మాటలు అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.