Dhamaka Movie First Day Collections | ‘క్రాక్’ తర్వాత సరైన విజయం లేని రవితేజ మళ్ళీ ట్రాక్ ఎక్కినట్టే కనిపిస్తున్నాడు. ధమాకా సినిమాకు మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. ఆయన గత సినిమాలతో పోలిస్తే అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతుంది ధమాకా. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రొటీన్ కమర్షియల్ సినిమా అయినా కూడా ఎంటర్టైన్మెంట్ బాగా ఉండటంతో కలెక్షన్స్ బాగానే వచ్చాయి. మొదటి రోజు ఏపీ తెలంగాణలో 4.50 కోట్ల షేర్ తెచ్చుకున్న ఈ సినిమాకు.. ప్రపంచ వ్యాప్తంగా 5.10 కోట్ల షేర్ వచ్చింది ఏరియా వైజ్ కలెక్షన్స్ ఒకసారి చూద్దాం..
నైజాం: 2.10 కోట్లు
సీడెడ్: 0.66 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.56 కోట్లు
ఈస్ట్: 0.24 కోట్లు
వెస్ట్: 0.16 కోట్లు
గుంటూరు: 0.40 కోట్లు
కృష్ణా: 0.25 కోట్లు
నెల్లూరు: 0.13 కోట్లు
AP + TS ఫస్ట్ డే డేస్ కలెక్షన్స్ : 4.50 కోట్లు
కర్ణాటక + ROI: 0.45 కోట్లు
ఓవర్సీస్: 0.15 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్: 5.10 కోట్లు షేర్
‘ధమాకా’ సినిమా సేఫ్ అవ్వాలంటే 20 కోట్ల షేర్ రావాలి. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్స్ రిపోర్టు చూసిన తర్వాత వీకెండ్ లోనే సేఫ్ జోన్ కు వచ్చేలా కనిపిస్తోంది. అదే జరిగితే రెండేళ్ల తర్వాత రవితేజకు హిట్టు పడినట్టే.