తమిళంలో విజయం సాధించిన ‘దా..దా’ చిత్రం ‘పా..పా’ పేరుతో తెలుగులో అనువాదమవుతున్నది. కవిన్, అపర్ణాదాస్ జంటగా నటించారు. జేకే ఎంటర్టైమెంట్స్ పతాకంపై నిర్మాత ఎం.ఎస్.రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇటీవల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత ఎం.ఎస్.రెడ్డి మాట్లాడుతూ ‘యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ఇది. ఫ్యామిలీ ఎలిమెంట్స్, ఎమోషన్స్ కట్టిపడేస్తాయి. తమిళంలో మంచి వసూళ్లను రాబట్టిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించడం ఆనందంగా ఉంది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎళిల్ అరసు కె, సంగీతం: జెన్ మార్టిన్, దర్శకుడు: గణేష్ కె బాబు.