Devil Movie Teaser | రిజల్ట్ సంగతి పక్కన పెడితే కళ్యాణ్‌రామ్ ఎప్పుడు ప్రయోగాలకు పెద్ద పీఠ వేస్తుంటాడు. ప్రేక్షకులకు కొత్త తరహా కథలను చూపించాలని ఎప్పుడూ ఆరాటపడుతుంటాడు. చాలా కాలం తర్వాత ‘బింబిసార’తో తిరుగులేని విజయం సాధించిన కళ్యాణ్‌రామ్ అదే జోష్‌తో ‘అమిగోస్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్‌కు ముందు జరిపిన హడావిడితో సినిమాపై ఎక్కడలేని బజ్ ఏర్పడింది. కానీ తీరా రిలీజయ్యాక డివైడ్ టాక్ తెచ్చుకుని పోస్టర్ ఖర్చులను కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. అయితే ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్ నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.
‘బాబు బాగా బిజీ’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ మేడారం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినిమాపై తిరుగులేని అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. స్వాతంత్రానికి ముందు కళ్యాణ్‌రామ్ బ్రిటీషర్లకు సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. ఆయన పేరు, రూపు రేఖలు ఎవరికీ తెలియదు. అయితే దేశ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా బ్రిటీషర్ల కోసం డెవిల్ ఎందుకు పని చేశాడు? దాని వెనుక ఉన్న రహస్య మిషన్ ఏంటి? వంటి పలు ప్రశ్నలతో టీజర్‌ను నవీన్ మేడారం అద్భుతంగా కట్ చేశాడు. మనసులో ఉన్న భావన ముఖంలో తెలియకూడదు. మెదడులో ఉన్న ఆలోచన మాటల్లో బయటపడకూడదు. అదే గూఢచారికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం చివర్లో ఓ డైలాగ్‌తో సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచాడు.
చూస్తుంటే ఈ సారి కళ్యాణ్‌రామ్ మరో బంపర్ హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు. లుక్స్ పరంగా కళ్యాణ్ రామ్ అదిరిపోయాడు. సినిమాను భారీ హంగులతో కాస్త రిచ్‌గానే తీసినట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వీర లెవల్లో ఉంది. ముఖ్యంగా సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫి అద్భుతంగా ఉంది. టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మించాడు.