Devil Movie | రిజల్ట్ సంగతి పక్కన పెడితే కళ్యాణ్‌రామ్ ఎప్పుడు ప్రయోగాలకు పెద్ద పీఠ వేస్తుంటాడు. ప్రేక్షకులకు కొత్త తరహా కథలను చూపించాలని ఎప్పుడూ ఆరాటపడుతుంటాడు. చాలా కాలం తర్వాత ‘బింబిసార’తో తిరుగులేని విజయం సాధించిన కళ్యాణ్‌రామ్ అదే జోష్‌తో ‘అమిగోస్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్‌కు ముందు జరిపిన హడావిడితో సినిమాపై ఎక్కడలేని బజ్ ఏర్పడింది. కానీ తీరా రిలీజయ్యాక డివైడ్ టాక్ తెచ్చుకుని పోస్టర్ ఖర్చులను కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. అయితే ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్ నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి.
ఇక ప్రస్తుతం కళ్యాణ్‌రామ్ మూడు సినిమాలను సెట్స్ మీద ఉంచాడు. అందులో డెవిల్ ఒకటి. ‘బాబు బాగా బిజీ’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ మేడారం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా చిత్రబృందం ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. పీరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 1945 టైమ్‌లో జరుగునుంది. బ్రిటీష్ వాళ్లు పాలిస్తున్న సమయంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్ రహస్య గూఢాచారిగా కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ సినిమానూ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. కళ్యాణ్‌రామ్‌కు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తుంది. ఈ సినిమాను ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
And CUT!! 🎬#Devil wraps up shooting with a bang💥#NandamuriKalyanRam will leave you breathless🔥as #TheBritishSecretAgent@NANDAMURIKALYAN @iamsamyuktha_ #AbhishekNama @AbhishekPicture @NaveenMedaram @soundar16 @SrikanthVissa @rameemusic pic.twitter.com/VU0rokBhLh
— Vamsi Kaka (@vamsikaka) April 11, 2023