NBK109 Movie | ఒక కథకు స్క్రీన్ ప్లే ఎంత అవసరమో సంగీతం కూడా అంతే అవసరం. నిజానికి సినిమాకు హైప్ తీసుకురావాలంటే పాటలు చాలు. కథకు సరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే సినిమా ఫ్లేవరే మారిపోతుంది. కూర చివర్లో కొత్తి మీర వేస్తే ఆ కిక్కే వేరు అన్నట్లు సినిమాకు అదిరిపోయే సంగీతం దట్టిస్తే ఆ స్థాయిలో వర్కవుట్ అవుతుంది. ఇక ఈ మధ్య టాలీవుడ్ లో ఏ ప్రాజెక్ట్ చూసిన థమన్ పేరే కనిపిస్తుంది. పెద్ద పెద్ద సినిమాలతో పాటు మీడియం బడ్జెట్ సినిమాలకు కూడా సంగీతం అందిస్తూ తెగ బిజీగా గడుపుతున్నాడు. ముఖ్యంగా బాలయ్య సినిమాలకు థమన్ ఇచ్చే సంగీతం వేరే లెవల్. అఖండ, వీరసింహా రెడ్డి సినిమాలకు బాలయ్య ఎలివేషన్ సీన్లకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్సే. ఆ సినిమాలు ఆ స్థాయిలో ఆడడానికి థమన్ కూడా కీలకపాత్ర పోషించాడనడంలో సందేహమే లేదు. ఇక ఆ నమ్మకంతోనే బాలయ్య భగవంత్ కేసరి సినిమాలో కూడా తననే ఏరి కోరి మరి పెట్టుకున్నాడు.
ఇక రెండు రోజుల క్రితం విడుదలైన టీజర్ కు ఏ స్థాయిలో థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక బాలయ్య సినిమాకు థమన్ కంటె గొప్పగా సంగీతం ఎవరు కొట్టలేరేమో అనేంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. కాగా ఇప్పుడు బాలయ్య, బాబీతో చేయబోయే సినిమాకు సంగీత దర్శకుడిని మార్చుతున్నట్లు తెలుస్తుంది. ఈ సారి దేవి శ్రీ ప్రసాద్ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. ఇక వాల్తేరు వీరయ్యకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడని బాబీ.. దేవి శ్రీ ప్రసాద్ పేరును కన్సిడర్ చేసినట్లు టాక్. బాలయ్య కూడా వెంటనే ఒకే చెప్పాడట. పైగా ఇప్పుడు థమన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజనుకు పైగానే పెద్ద సినిమాలున్నాయి. దాంతో ఈ సినిమా చేయడానికి కాస్త ఎక్కువే టైమ్ పడుతుంది. ఈ క్రమంలో చిత్రబృందం దేవి శ్రీ ప్రసాద్ ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట.