Devi sri prasad | రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హవా ఇప్పుడు కొంచెం తగ్గింది. గతంలో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ప్రతి ఆల్భమ్ హిట్టే. ఈయన పాటల వల్లే సినిమాలకు మంచి క్రేజ్ వచ్చేది అంటే అతిశయోక్తికాదు. తాజాగా ఈయన పుష్ప సినిమాకు అందించిన పాటలు ఖండాంతరాలు దాటాయి. సినీ సెలబ్రిటీస్ నుండి క్రికెట్ సెలబ్రిటీస్ వరకు పుష్పలోని పాటలు రీల్స్‌లో మారుమోగిపోయాయి. టాంజానీయాలోని కిలి పాల్ నుండి డచ్‌లోని ఎమ్మా హిస్టర్ వరకు పుష్ప పాటలే. ఈ క్రేజ్‌తో దేవీ శ్రీ ప్రసాద్‌కు బాలీవుడ్ ఆఫర్లు ముంచెత్తుతున్నాయి.
వరుణ్ దావణ్ హీరోగా నితీష్ తివారి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. సాజిద్ నడియాద్వాల నిర్మిస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మార్చి 15 నుండి ప్రారంభంకానుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవీ శ్రీ ప్రసాద్‌ను తీసుకున్నారు. మాములుగా బాలీవుడ్లో ఒక్కో సినిమాకు ఇద్దరు, ముగ్గరు సంగీత దర్శకులు ఉంటారు. కానీ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సోలోగా దేవీ ఒక్కడే పాటలన్ని కంపోజ్ చేయనున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ తాజాగా రణ్వీర్ సింగ్, పూజా హెగ్డే నటించిన సర్కస్ మూవీలో రెండు పాటలు కంపోజ్ చేశాడు. దేవీ శ్రీ ప్రసాద్ ప్రస్తుతం పుష్ప-2, ఆడవాళ్లు మీకు జోహర్లు, రంగరంగ వైభవంగ తో పాటు చిరంజీవి-బాబీ సినిమాలకు సంగీతం వహిస్తున్నాడు.