నాంది తర్వాత సినిమాల ఎంపికలో రూటు మార్చేశాడు అల్లరి నరేశ్ (Allari Naresh). ఈ టాలెంటెడ్ యాక్టర్ నాంది ఫేం విజయ్ కనకమేడల డైరెక్షన్లో మరోసారి నటిస్తున్న చిత్రం ఉగ్రం (Ugram). ఇప్పటికే విడుదలైన ఉగ్రం టీజర్ (Ugram teaser) సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. దేవేరి వీడియో సాంగ్ (Deveri Video Song)ను విజయ్ దేవరకొండ లాంఛ్ చేశాడు. ఉగ్రం నుంచి దేవేరి సాంగ్‌ను లాంఛ్ చేయడం సంతోషంగా ఉంది..అంటూ సాంగ్‌ను అందరితో పంచుకున్నాడు.
దేవేరి గుండెల్లో చేరి.. మదిలో మోగిందే సరిగమ సావేరి అంటూ ఫీల్ గుడ్ ఇంప్రెస్తో సాగుతున్న ఈ పాట సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. శ్రీమణి రాసిన ఈ పాటను శ్రీచరణ్ పాకాల కంపోజ్ చేయగా.. అనురాగ్ కులకర్ణి పాడాడు. పోలీసాఫీసర్ అయిన నరేశ్ హీరోయిన్ మిర్ణాతో ప్రేమలో మునిగిపోతూ పాడుకునే ఈ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతున్నట్టు విజువల్స్ చెప్పేస్తున్నాయి. ఉగ్రంలో మలయాళ భామ మిర్ణా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
ఈ చిత్రానికి టూమ్ వెంకట్, అబ్బూరి రవి స్టోరీ, డైలాగ్స్ అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది తెరకెక్కిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ సినిమాకు మరింత హైప్ తీసుకురావడం గ్యారంటీ అని వీడియో సాంగ్ చెప్పేస్తుంది. ఉగ్రం మే 5న థియేటర్లలో సందడి చేయనుండగా.. టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
దేవేరి వీడియో సాంగ్..
Happy to launch #Deveri from #Ugram 😊
My best wishes @allarinaresh anna @mirnaaofficial @DirVijayK @sahugarapati7 garu @harish_peddi garu @Shine_Screens @SricharanPakala @anuragkulkarni_ @ShreeLyricist and the entire team ❤️ pic.twitter.com/uiCsWvqcXd
— Vijay Deverakonda (@TheDeverakonda) March 19, 2023
ఉగ్రం టీజర్..
RC 15 | గొప్ప అనుభూతినిస్తోంది.. ప్రభుదేవా టీం సర్ప్రైజ్పై రాంచరణ్
Dasara | దసరా స్పెషల్ ప్రమోషన్స్.. వైజాగ్ స్టేడియంలో నాని