Devara | అగ్రనటుడు నందమూరి తారక రామారావు కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’(Devara). జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తుండగా, సైఫ్అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతం నేపథ్యంలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది. ఇదిలావుంటే నేడు దర్శకుడు కొరటాల శివ పుట్టినరోజు ఈ సందర్భంగా దేవర టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపింది.
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్, హరికృష్ణ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ స్వరకర్త. మరోవైపు అదేరోజున పవన్ కళ్యాణ్ ఓజీ విడుదల అవుతున్నట్లు మేకర్స్ ప్రకటించగా తాజాగా ఈ చిత్రం వాయిదా పడినట్లు తెలుస్తుంది.
Wishing the genius director #KoratalaSiva a very Happy Birthday
Get ready for his unparalleled vision that will shape #Devara into a Massive Storm in Indian Cinema pic.twitter.com/k4nFIdz4C0
— Devara (@DevaraMovie) June 15, 2024