Devara Movie | తారక్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్.. సలార్, డంకీ సినిమాలతో రానున్న ‘దేవర’ టీజర్.?
Devara Movie | టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ (NTR) హీరోగా.. కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘దేవర’(Devara). ఈ చిత్రంతో శ్రీదేవి గారలపట్టి జాన్వీకపూర్ (Janvi kapoor) తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Devara Movie | టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ (NTR) హీరోగా.. కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘దేవర’(Devara). ఈ చిత్రంతో శ్రీదేవి గారలపట్టి జాన్వీకపూర్ (Janvi kapoor) తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిభాగం 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి తారక్ లుక్‌తో పాటు, సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ లుక్‌లను రిలీజ్ చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా టీజర్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ తారక్ ఫ్యాన్స్ వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ టీజర్‌పై ఒక సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది.
దేవర టీజర్‌ను డిసెంబర్ 25న కానీ లేదా జనవరి 1 విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. అయితే లేటెస్ట్గా దేవర టీజర్‌ని డిసెంబర్ 22న విడుదల కానున్న రెండు పాన్ ఇండియా సినిమాలు సలార్, డంకీ సినిమాలతో థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం దేవరకి సాలిడ్ రీచ్ దొరికేసినట్లే. ఓవర్సీస్లో డంకీ సినిమాకి, ఇండియాలో సలార్ సినిమాకి సాలిడ్ బజ్ ఉంది కాబట్టి ఈ సినిమాలకి పాటు దేవర టీజర్ అటాచ్ చేస్తే బాగుంటుంది అని మేకర్స్ అలోచిస్తున్నట్లు సమాచారం. కాగా దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

