Devara Movie | టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), కొరటాల శివ(Koratala Shiva) కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘దేవర'(Devara). ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలావుంటే.. ఈ మూవీ ఓటీటీకి సంబంధించి ఓ సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ఓటీటీ ప్లాట్ ఫామ్‌ను కన్ఫర్మ్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ రాసుకోచ్చింది. ఈ విషయాన్ని తెలుపుతూ.. దేవర విలన్ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు. ”అసలైన యోధుడికోసం సిద్ధంగా ఉండండి. దేవర సినిమా థియేట్రికల్ రిలీజ్ అనంతరం త్వరలోనే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది” అంటూ రాసుకొచ్చింది. దీనికి #నెట్‌ఫ్లిక్స్ పండగా(NetflixPandaga) అంటూ హ్యాష్ ట్యాగ్‌ను కూడా జోడించింది.
Devara strikes fear in the hearts of villains. Gear up for the ultimate hero. 🫡#Devara is coming soon on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada, Hindi as a post theatrical release! #NetflixPandaga pic.twitter.com/25n1v2wYhu
— Netflix India South (@Netflix_INSouth) January 15, 2024