ఎన్టీఆర్ 30వ చిత్రం ‘దేవర’ ద్వారా తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్నది అందాల తార జాన్వీకపూర్. దక్షిణాదిలో ఈ భామకిది తొలి చిత్రం కావడంతో పాత్ర విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. ఈ షెడ్యూల్లో జాన్వీకపూర్ పాల్గొంటున్నది. ఈ సినిమాలో ఈ అమ్మడి పాత్ర గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. ఈ సినిమాలో జాన్వీకపూర్ మత్స్యకార కుటుంబానికి చెందిన యువతి పాత్రలో కనిపించనుందట. కథాగమనంలో కీలకంగా ఉంటూ భావోద్వేగ ప్రధానంగా ఆమె పాత్ర సాగుతుందట. కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన జాన్వీకపూర్ ఫస్ట్‌లుక్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. సంప్రదాయ లంగావోణిలో పల్లెటూరి యువతిగా ఆమె లుక్స్‌కు ప్రశంసలు లభించాయి. తొలి చిత్రంలో చక్కటి అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకోవాలనే తలంపుతో ఉన్న జాన్వీకపూర్ తన పాత్రను ఓ సవాలుగా స్వీకరించిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.