Devara Box Office | ఎన్టీఆర్ కథానాయికుడిగా వచ్చిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతుంది. ఫస్ట్ రోజే రూ.172 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.243 కోట్ల వసూళ్లను సాధించింది. అయితే ఆదివారం వీకెండ్‌తో రూ.300 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిత్రం. ఈ చిత్రం మూడు రోజుల్లో రూ.304 కోట్ల వసూళ్లను సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
చాలా రోజుల తర్వాత తారక్ సోలోగా రావడంతో ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటించగా. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించాడు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పించగా.. యువసుధా ఆర్ట్స్ పతకంపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మించారు.
A hurricane named #Devara…
has wiped out every nook and corner with his ‘X’ style of destruction 🔥🔥#BlockbusterDevara pic.twitter.com/YiISj6swf2— Devara (@DevaraMovie) September 30, 2024