Devara | సెప్టెంబర్ 27న ఎన్టీఆర్ ‘దేవర 1’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె, నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మించిన ఈ చిత్రం తొలి రోజున 172 కోట్ల వసూళ్లను రాబట్టిందని, అదే స్పీడును కొనసాగిస్తూ ఈ వారాంతం ముగిసే వరకూ.. అంటే మూడు రోజుల్లోనే 304కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించిందని నిర్మాతలు తెలిపారు. ‘ఇప్పటికే 80శాతం రికవరీ అయ్యింది, తెలుగు రాష్ర్టాల్లో 87.69 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా హిందీలోనూ మంచి వసూళ్లను రాబడుతున్నది.
సముద్ర నేపథ్యంలో భయం లేని వారియర్స్ చుట్టూ అల్లిన ఈ కథ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఎన్టీఆర్ వన్‌మ్యాన్ షోగా ‘దేవర’ను అభివర్ణిస్తున్నారు. అనిరుథ్ సంగీతం, రత్నవేలు ఛాయాగ్రహణం సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాయి. జాన్వీకపూర్, సైఫ్ ఆలీఖాన్, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో నటించిన ఈ చిత్రం మరిన్ని రికార్డులతో దూసుకుపోవడం ఖాయం.’ అని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.