Devara Movie | మరికొన్ని గంటల్లో టాలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా దేవర ఫీవర్ మొదలవ్వబోతుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అవ్వగా.. హాట్ కేకుల్లా అమ్ముడయిపోయాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామున 1.08 గంటలకు స్పెషల్ షోస్ వేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన టికెట్లు కూడా బుక్ అయిపోయాయి.
ఇదిలావుంటే ఎన్టీఆర్ సినిమాలకు కంచుకోటగా ఉన్న హైదరాబాద్ కూకట్ పల్లిలోని మల్లికార్జున(Mallikarjuna), భ్రమరాంబ (Bramarambha) థియేటర్లలో ఈ సినిమా మిడ్నైట్ షోను క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆ థియేటర్ ముందు పెట్టిన బోర్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మల్లికార్జున, భ్రమరాంబ థియేటర్లలో దేవర 1 గంట షో లేదంటూ థియేటర్ యాజమాన్యం తెలిపింది. దీంతో స్పెషల్ షో చూద్దాం అనుకున్నా ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది.
#Devara Brahmaramba, Mallikarjuna midnight 1am shows got cancelled. pic.twitter.com/tZtUWNQxEX
— At Theatres (@AtTheatres) September 26, 2024