Devaki Nandana Vasudeva | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) ప్రస్తుతం రెండో సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. గుణ 369 ఫేం అర్జున్ జంధ్యాల (Arjun Jandyala) దర్శకత్వలో Ashok Galla 2గా వస్తున్న ఈ మూవీ ఫిబ్రవరిలో లాంఛనంగా ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ఫైనల్ చేస్తూ.. టీజర్‌ను లాంఛ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి దేవకీ నందన వాసుదేవ టైటిల్ ఫిక్స్ చేశారు.
నీ బిడ్డకు మరణగండం.. లేదా అతని చేతిలో మరొకరికి మరణం అంటూ సాగే డైలాగ్స్‌తో షురూ అయింది టీజర్. ఈ చిత్రానికి
జాంబిరెడ్డి ఫేం ప్రశాంత్ వర్మ కథనందిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే ఫస్ట్ యాక్షన్ వీడియోను లాంఛ్ చేశారని తెలిసిందే. బురదలో జరిగే ఫైట్ సన్నివేశంతో కట్ చేసిన ఫస్ట్ యాక్షన్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. యూనిక్ కథాంశంతో వస్తున్న ఈ చిత్రంలో అశోక్ గల్లా మాస్ అవతార్‌లో కనిపించబోతున్నట్టు టీజర్‌తో తెలిసిపోతుంది.
ప్రొడక్షన్ నంబర్ వన్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ (ఎన్ఆర్ఐ) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తుండగా..
భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ కాగా తమ్మిరాజు ఎడిటర్. కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల డైరెక్ట్ చేసిన గుణ 369 బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో అర్జున్ జంధ్యాల ఈ సారి ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.
సంభవామి యుగే యుగే 🙏🏻
Witness the massive clash of Good vs Evil 🔥#AshokGalla2 is titled as #DevakiNandanaVasudeva ❤️🔥#DNV Teaser out now💥
– https://t.co/WBTBFeT5dL@AshokGalla_ @varanasi_manasa @DevdattaGNage @ArjunJandyala @PrasanthVarma @bheemsceciroleo #RasoolEllore… pic.twitter.com/IEj9hrKlMs— BA Raju’s Team (@baraju_SuperHit) January 10, 2024
దేవకీ నందన వాసుదేవ టీజర్..
ఫస్ట్ యాక్షన్ వీడియో..
అశోక్ గల్లా కొత్త సినిమా లాంఛింగ్ స్టిల్స్..
#AshokGalla2 Launched with a formal pooja ceremony❤️
Clap by @VenkyMama
1st shot Dir #BoyapatiSreenu
🎥Switch On #NamrataGhattamaneni
📝 #MiryalaRavinderReddy@PrasanthVarma @sahugarapati7 @harish_peddi@AshokGalla_ @ArjunJandyala #BheemsCeciroleo #SBalakrishna @lalithambikaoff pic.twitter.com/7zytDh18aC— BA Raju's Team (@baraju_SuperHit) February 5, 2023