Devaki Nandana Vasudeva | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం దేవకీ నందన వాసుదేవ (Devaki Nandana Vasudeva). జాంబిరెడ్డి, హనుమాన్ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prashanth Verma) ఈ చిత్రానికి కథనందిస్తుండగా.. గుణ 369 ఫేం అర్జున్ జంధ్యాల (Arjun Jandyala) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం తాజాగా విడుదల తేదీని ప్రకటించింది.
ఈ సినిమాను నవంబర్ 14న విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. ఈ సినిమాలో అశోక్ గల్లా సరసన హీరోయిన్గా మాజీ మిస్ ఇండియా (2020) మానస వారణాసి (Manasa Varanasi) నటిస్తుంది. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ (ఎన్ఆర్ఐ) ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ కాగా తమ్మిరాజు ఎడిటర్. ఇక కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల చివరగా డైరెక్ట్ చేసిన గుణ 369 బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సారి ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలని చూస్తున్నాడు అర్జున్ జంధ్యాల.
#DevakiNandanaVasudeva, starring Ashok Galla, coming to theatres on Thursday, 14th November. Story by Prasanth Varma. pic.twitter.com/wBlCgEszuJ
— Aakashavaani (@TheAakashavaani) October 6, 2024