Devaki Nandana Vasudeva | టాలీవుడ్ యాక్టర్ అశోక్ గల్లా (Ashok Galla) నటిస్తోన్న తాజా చిత్రం దేవకీ నందన వాసుదేవ. Ashok Galla 2గా వస్తోన్న ఈ చిత్రానికి గుణ 369 ఫేం అర్జున్ జంధ్యాల (Arjun Jandyala) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. నీ బిడ్డకు మరణగండం.. లేదా అతని చేతిలో మరొకరికి మరణం అనే డైలాగ్స్‌తో షురూ అయిన టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ జై బోలో కృష్ణ ప్రోమోను లాంఛ్ చేశారు. రఘురామ్ రాసిన ఈ పాటను బీమ్స్ సిసిరోలియో కంపోజిషన్‌లో స్వరాగ్ కీర్తన్ పాడారు. ఇప్పటికే Yeamayyinde ఈ విషయాన్ని షేర్ చేస్తూ రిలీజ్ చేసిన అశోక్ గల్లా లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి జాంబిరెడ్డి ఫేం ప్రశాంత్ వర్మ కథనందిస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.
ఇక ఫస్ట్ యాక్షన్ వీడియోలో.. బురదలో జరిగే ఫైట్ సన్నివేశంతో కట్ చేసిన ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఇప్పటికే సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. యూనిక్ కథాంశంతో వస్తోన్న ఈ మూవీలో అశోక్ గల్లా మాస్ అవతార్‌లో కనిపించబోతున్నట్టు టీజర్‌తో చెప్పేశాడు డైరెక్టర్. ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ (ఎన్ఆర్ఐ) తెరకెక్కిస్తున్నారు.
సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. అర్జున్ జంధ్యాల కార్తికేయ హీరోగా డైరెక్ట్ చేసిన గుణ 369 బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ సారి సూపర్ హిట్ కొట్టాలని ఎదురుచూస్తున్నాడు.
జై బోలో కృష్ణ సాంగ్ ప్రోమో..
దేవకీ నందన వాసుదేవ టీజర్..
ఫస్ట్ యాక్షన్ వీడియో..
అశోక్ గల్లా కొత్త సినిమా లాంఛింగ్ స్టిల్స్..
#AshokGalla2 Launched with a formal pooja ceremony❤️
Clap by @VenkyMama
1st shot Dir #BoyapatiSreenu
🎥Switch On #NamrataGhattamaneni
📝 #MiryalaRavinderReddy@PrasanthVarma @sahugarapati7 @harish_peddi@AshokGalla_ @ArjunJandyala #BheemsCeciroleo #SBalakrishna @lalithambikaoff pic.twitter.com/7zytDh18aC— BA Raju's Team (@baraju_SuperHit) February 5, 2023