Deva Movie | బాలీవుడ్ నటుడు (Shahid Kapoor), పూజాహెగ్డే (Pooja Hegde) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దేవా’ (Deva). బిగ్ బీ అమితాబ్ బచ్చన్ దేవా సినిమాను ప్రేరణగా తీసుకుని ఈ చిత్రం రాగా.. మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రోస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం జనవరి 31న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ను పంచుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం మార్చి 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.
ఏసీపీ దేవ్ (షాహిద్ కపూర్) నిజాయతీ పరుడైన ఒక పోలీస్ అధికారి. డ్యూటీ మైండెండ్గా ఉంటూ తనదైన యాటిట్యూడ్‌తో కనిపిస్తాడు. అయితే ఓ కేసు మిస్టరీని చేధించే క్రమంలో అతడికి యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్లో గతం మరిచిపోతాడు. దీంతో ఒక కీలకమైన కేసు మధ్యలోనే ఆగిపోతుంది. అయితే ముంబైలో కీలకంగా మారిన కేసు ఏమిటి? దేవ్ గతం మరిచిపోవడంతో కేసు విచారణలో ఏం జరిగింది? జర్నలిస్టు దివ్య సతాయే (పూజా హెగ్డే)కు దేవ్ ఉన్న సంబంధం ఏమిటి? దేవ్ గతం మరిచిపోవడంతో దివ్య ఏం చేసింది? గతం మరిచిపోవడానికి ముందు.. ఆ తర్వాత దేవ్ జీవితం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే దేవ్ సినిమా కథ.
Bhasad macha 🥁🥁🥁 Trigger chala 🚨🚨🚨 Deva aa raha hai 🔥#DevaOnNetflix pic.twitter.com/9eHQGvnjWn
— Netflix India (@NetflixIndia) March 27, 2025