The Road | దక్షిణాదిన వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతున్న త్రిష (Trisha) ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలున్నాయని తెలిసిందే. ఈ బ్యూటీ ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ టైటిల్ రోల్ పోషిస్తోన్న లియోలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మరోవైపు త్రిష ప్రధాన పాత్రలో ది రోడ్ (The Road) కూడా నటిస్తోంది. రివేంజ్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ అక్టోబర్ 6న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని మేకర్స్ ఇటీవలే ప్రకటించేశారు.
అయితే త్రిష సినిమాలకు సౌతిండియాలో మార్కెట్ బాగానే ఉంటుంది. ఇదిలా ఉంటే మరో ఐదు రోజుల్లో ది రోడ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తెలుగు వెర్షన్‌ను కూడా విడుదల చేయాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నా.. మేకర్స్ ఎలాంటి స్పందన లేదు. దీంతో ఇక ది రోడ్ తెలుగు విడుదల దాదాపు లేనట్టేనని ఓ వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. మరి దీనిపై త్రిష టీం రాబోయే రోజుల్లో ఏదైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
మేకర్స్ ది రోడ్ నుంచి ఓ విధి (Oh Vidhi Promo) పాట ఎమోషనల్‌గా సాగుతూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రానిక ఇశ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. అరుణ్ వసీగరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో డ్యాన్సింగ్ రోజ్గా పాపులర్ అయిన మాలీవుడ్ యాక్టర్ షబీర్ (Shabeer Kallarakkal) కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ మూవీని ఏఏఏ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. త్రిష ఖాతాలో మరోవైపు లెజెండరీ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్లో కమల్ హాసన్ నటిస్తోన్న KH234 కూడా ఉంది. అదేవిధంగా అజిత్ కొత్త ప్రాజెక్ట్ Vidaa Muyarchia లో హీరోయిన్గా దాదాపు ఫైనల్ అయినట్టు వార్తలు వస్తుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఓ విధి సాంగ్ ప్రోమో..
ఓ విధి సాంగ్..