Deputy CM Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలలో పర్యటించిన విషయం తెలిసిందే. రోడ్లు లేక ఇబ్బంది పడుతున్న గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 9 గ్రామాల్లో సుమారు 50 కోట్లతో రహదారుల నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అయితే పవన్‌ని చూడడానికి అభిమానులు పెద్దఎత్తున్న తరలివచ్చారు. ఈ నేపథ్యంలో అభిమానులకు పవన్ రిక్వెస్ట్ చేశాడు.
ఆయన మాట్లాడుతూ.. అభిమానులను నేను కోరేది ఒక్కటే. దయచేసి నన్ను నా పని చేసుకోనివ్వండి. నేను బయటికి వచ్చినప్పుడు మీరు నా మీద పడిపోతే నేను ఏ పని చేయలేను. రోడ్లు పరిస్థితి ఎలా ఉంది చూద్దాం అంటే అందరూ ఇక్కడే ఉండడంతో ఏం కనిపించట్లేదు. ఓజీ ఓజీ అని అరిస్తే పనులు జరగవు. నేను పనిచేస్తే మీ ఫ్యూచర్‌కి మంచి జరుగుతుంది. నేనున ఎక్కడికి వెళితే అక్కడ నన్ను చుట్టుముడితే నేను పనిచేయలేను. తెలుగు నేర్పించిన నేల ఇది. తిరుగుబాటు అంటే ఏంటో తెలిపిన నేల ఇది. ఇప్పుడు ఏంటంటే సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారు. మాట్లాడితే అన్న మీసం తిప్పు అంటారు.. నేను మీసం తిప్పితే రోడ్లు పడవు.. పనులు జరగవు. అందుకే నన్ను పని చేయనివ్వండి అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకోచ్చారు.