Pawan Kalyan | జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు దస్త్రాలపై సంతకాలు చేశారు. ఉపాధిహామీని ఉద్యానవన పనులను అనుసంధానించే నిధుల మంజూరు దస్త్రం, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణాలకు సంబంధించిన దస్త్రాలపై ఆయన తొలి సంతకం చేశారు. అయితే, ఇటీవల వదిన సురేఖ ఖరీదైన పెన్నును కానుకగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఖరీదైన పెన్నుతోనే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ సంతకాలు చేశారు. ఇటీవల పదవీ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం హైదరాబాద్‌లోని సోదరుడు మెగాస్టార్ చిరంజీవికి ఇంటికి పవన్ కల్యాణ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వదిన సురేఖ పవన్ కల్యాణ్‌కు పెన్ను కానుకగా ఇచ్చారు. జనసేనానికి పెన్నును గిఫ్ట్‌గా ఇచ్చిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా డెప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్‌కు పలువురు మంత్రులు కలిసి అభినందనలు తెలిపారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా..
ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్‌కు సురేఖ అరుదైన బహుమతిని ఇచ్చింది. వాల్ట్ డిస్నీకి చెందిన మోంట్ బ్లాంక్ పెన్ను కానుకగా అందించారు. చాలామంది ఈ పెన్నులో అంత గొప్పగా ఏముందని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ పెన్ను అక్షరాల రూ.లక్ష పైగానే ఉంటుందని తెలుస్తుంది. మోంట్ బ్లాక్ డిస్నీ ఎడిషన్ పెన్నులు సుమారు రూ.90వేల నుంచి ఏకంగా రూ.రెండున్నర లక్షల వరకు ఉంటాయి. అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ డిస్నీకి చెందింది ఈ మోంట్ బ్లాంక్. ఈ కంపెనీ లగ్జరీ పెన్నులు, రీఫిల్స్, బ్యాగ్స్, లెదర్ వస్తువులు, వాచీలు, సెంట్స్ తదితర వస్తువులను తయారు చేసి విక్రయిస్తుంది. మోంట్ బ్లాంక్ పెన్నును లిమిటెడ్ ఎడిషన్‌తో మాత్రమే రూపొందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం కొన్ని పెన్నులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మోనోరైల్ సిస్టమ్ స్ఫూర్తితో ఈ పెన్నును రూపొందించింది. ప్లాటినమ్ కోట్తో ఈ పెన్ను రూపొందించడం కారణంగానే ధర ఎక్కువగా ఉంటుందని చెబుతారు. 1901లో ఈ కంపెనీ పెన్నులను తయారు చేయడం మొదలుపెట్టింది.