6 నుంచి కుల జనగణన
రాష్ట్రంలో వచ్చే నెల 6 నుంచి కులగణన చేపట్టనున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం ఆయన సచివాలయంలో సామాజికవేత్తలు, మేధావులతో సమావేశమై కులగణనలో చేయాల్సిన మార్పులు, చేర్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.
- నేడు కలెక్టర్లతో సమావేశం
- సామాజికవేత్తలతో భట్టి
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వచ్చే నెల 6 నుంచి కులగణన చేపట్టనున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం ఆయన సచివాలయంలో సామాజికవేత్తలు, మేధావులతో సమావేశమై కులగణనలో చేయాల్సిన మార్పులు, చేర్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. కులగణనకు సంబంధించి దిశానిర్దేశం చేయడానికి కలెక్టర్లతో మంగళవారం కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 300 మంది సామాజికవేత్తలు, మేధావులు, అభ్యుదయవాదులతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు, సందేశాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. వీరితోపాటు కులసంఘాలు, యువజన సంఘాలను పిలిచి వారి అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఇతర భాగస్వాముల అభిప్రాయాలను సేకరిస్తామని వివరించారు. ఇప్పటికే నాలుగు జిల్లాల్లో 56 ఇండ్లను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని కులగణన సర్వే పూర్తి చేసినట్టు తెలిపారు. సమావేశంలో మంత్రి పొన్నం, ఎమ్మెల్సీ కోదండరాం, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

