Demon Movie OTT | తమిళంలో థ్రిల్స్, హారర్ అంశాలతో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న ‘డీమన్’ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. రమేశ్ పళనీవేల్ దర్శకత్వంలో, నిర్మాత ఆర్. సోమసుందరం నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం, నేటి నుంచి భవాని మీడియా ద్వారా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ప్రసారం కానుంది.
సచిన్ మణి మరియు అబర్నతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో, సురుతి పేరియసామి, కుంకి అశ్విన్, రవీనా కీలక పాత్రల్లో అదరగొట్టారు. ఈ సినిమా హారర్, సస్పెన్స్, మరియు ఊహించని ట్విస్టులతో కూడిన కథనంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించబోతున్నది. ప్రతి మలుపు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా తీర్చిదిద్దినట్లు చిత్ర బృందం పేర్కొంది. “డీమన్” చిత్రానికి రోనీ రాఫెల్ అందించిన సంగీతం, ఆర్.ఎస్. ఆనందకుమార్ చేసిన ఛాయాగ్రహణం, మరియు రవికుమార్ ఎం. చేసిన ఎడిటింగ్ సినిమాను మరింత అద్భుతంగా తీర్చిదిద్దాయి. ఈ వీకెండ్లో బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ “డీమన్”ను ఆహా ఓటీటీలో చూసి ఆస్వాదించాలని చిత్ర యూనిట్ ప్రేక్షకులను కోరింది.
When dreams turn to screams, horror beams#DEMON Stream Now on @ahavideoin
Link : https://t.co/0d1VaKOCAW
Distribution By : @BhavaniHDMovies@sachinmvm75 @suruthisamy8 @Abarnathi_6ya @RaveenaDaha #Navyasujji #Bhavanimedia pic.twitter.com/KEN3bzzfcx
— Phani Kandukuri (@phanikandukuri1) May 29, 2025